Godhuma Halwa
2013-09-20- Cuisine: Indian
- Skill Level: Intermediate
-
Add to favorites
గోధుమ హల్వా | Godhuma Halwa | Wheat Halwa
తయారీలో వాడే పదార్ధాలు
- అర కేజీ (½) గోధుమలు
- అర కేజీ (½) పంచదార
- యాభై (౫౦) గ్రా జీడిపప్పు
- సరిపడా యాలకులు
- అరకిలో (½) నెయ్యి
- కొద్దిగా మిఠాయి రంగు
తయారీ ఎలా
Step 1
గోధుమల్ని నీటిలో రాత్రంతా నాన పెట్టుకోవాలి.
Step 2
నాన పెట్టుకున్న గోధుమలను మరుసటి రోజు ఉదయం నీటిని ఒంపువేసి గోధుమల్ని బాగా రుబ్బుకోవాలి.
Step 3
రుబ్బుకున్న గోధుమ పిండిలో రెండు కప్పుల నీళ్ళు పోసి పాల రూపంలో వెలికి తీయాలి.
Step 4
ఈ విధంగా రెండు నుంచి మూడు సార్లు ఒక కప్పు నీళ్లు వేసి గ్రెండ్ చేసి దాంట్లో ఉన్న పాలను తీయాలి. గోధుమ పేస్టు పూర్తిగా పిప్పి పిప్పి అయ్యేంత వరకు చేస్తూ ఉండాలి.
Step 5
ఈ ద్రవాన్ని రెండు నుంచి మూడు గంటల వరకు ఒక పాత్రలో వేసి అలాగే ఉంచితే, అదనపు నీరు పైకి తేలుతుంది. తేలిన నీటిని బయటికి జాగ్రత్తగా ఒంపేయాలి.
Step 6
పాలు కొలచి అదే కొలతతో పంచదార తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని సన్నని సైగపై మిఠాయిరంగు కూడా వేసి కాయాలి. మధ్య మధ్యలో నెయ్యిని పోస్తూ కలుపుతూ ఉండాలి.
Step 7
ఈ తయారు చేసుకున్న మిశ్రమాన్ని బాగా చిక్కబడి ముకుడికి అంటుకోకుండా ఉండేంత వరకు ఉంచి పొయ్యి కట్టేయాలి.
Step 8
చిన్న చిన్న ముక్కలుగా జీడిపప్పుని కోసుకొని దానిలో యాలకుల పొడి కలుపుకొని దాంట్లో నెయ్యి వేసుకొని వేయించుకోవాలి.
Step 9
ఓ పాత్రకు నూనె రాసి హల్వాను పరిచి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- అర కేజీ (½) గోధుమలు
- అర కేజీ (½) పంచదార
- యాభై (౫౦) గ్రా జీడిపప్పు
- సరిపడా యాలకులు
- అరకిలో (½) నెయ్యి
- కొద్దిగా మిఠాయి రంగు
- గోధుమల్ని నీటిలో రాత్రంతా నాన పెట్టుకోవాలి.
- నాన పెట్టుకున్న గోధుమలను మరుసటి రోజు ఉదయం నీటిని ఒంపువేసి గోధుమల్ని బాగా రుబ్బుకోవాలి.
- రుబ్బుకున్న గోధుమ పిండిలో రెండు కప్పుల నీళ్ళు పోసి పాల రూపంలో వెలికి తీయాలి.
- ఈ విధంగా రెండు నుంచి మూడు సార్లు ఒక కప్పు నీళ్లు వేసి గ్రెండ్ చేసి దాంట్లో ఉన్న పాలను తీయాలి. గోధుమ పేస్టు పూర్తిగా పిప్పి పిప్పి అయ్యేంత వరకు చేస్తూ ఉండాలి.
- ఈ ద్రవాన్ని రెండు నుంచి మూడు గంటల వరకు ఒక పాత్రలో వేసి అలాగే ఉంచితే, అదనపు నీరు పైకి తేలుతుంది. తేలిన నీటిని బయటికి జాగ్రత్తగా ఒంపేయాలి.
- పాలు కొలచి అదే కొలతతో పంచదార తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని సన్నని సైగపై మిఠాయిరంగు కూడా వేసి కాయాలి. మధ్య మధ్యలో నెయ్యిని పోస్తూ కలుపుతూ ఉండాలి.
- ఈ తయారు చేసుకున్న మిశ్రమాన్ని బాగా చిక్కబడి ముకుడికి అంటుకోకుండా ఉండేంత వరకు ఉంచి పొయ్యి కట్టేయాలి.
- చిన్న చిన్న ముక్కలుగా జీడిపప్పుని కోసుకొని దానిలో యాలకుల పొడి కలుపుకొని దాంట్లో నెయ్యి వేసుకొని వేయించుకోవాలి.
- ఓ పాత్రకు నూనె రాసి హల్వాను పరిచి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
Average Member Rating
(0 / 5)
1 people rated this recipe
1,132