Kobbari Payasam

2013-08-31
Allrecipeshere

కొబ్బరి పాయసం | Kobbari Payasam

కొబ్బరి పాయసం చాలా రుచికరముగా ఉంటుంది . పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీరు ఇంటిలోనే  సులువుగా వండుకొవచ్చు 

తయారీలో వాడే పదార్ధాలు

  • పావు కిలో సన్నని బియ్యం
  • అర లీటరు పాలు
  • నాలుగు కొబ్బరి కాయలు
  • అర కిలో బెల్లం
  • పచ్చ కర్పూరం
  • యాలకుల పొడి
  • కొంచం సీమబాదం
  • కిస్ మిస్
  • జీడి పప్పు తగినంత
  • కుంకుమ పువ్వు కొద్దిగా

తయారీ ఎలా

Step 1

ముందుగా బెల్లం గడ్డలని సన్నగా తరిగి ఉంచుకోవాలి. సన్నని బియ్యాన్నిశుభ్రంగా కడిగి బుట్టకెయ్యాలి. దానిలో నీళ్ళు పోయేవరకు ఉంచుకోవాలి.

Step 2

కొబ్బరి కాయల ముక్కలను మిక్సిలో వేసుకొని బాగా మెత్తగా పొడి చేసుకోవాలి

Step 3

కొబ్బరి ముద్దను ఒక పల్చటి బట్టలో వేసుకొని కొబ్బరి పాలు పిండుకోవాలి మళ్ళీ నీళ్ళు పోసి పాలు పిండాలి.

Step 4

అలా ఒకటికి రెండు సార్లు చేస్తుంటే కొబ్బరిలోని పాలన్నీ వచ్చే స్తాయి. అలా కొబ్బరినుండి వచ్చిన పాలను ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

Step 5

బాదం , కుంకుమ పువ్వుని నీటిలో నానపెట్టుకోవాలి. ఆ బాదంపప్పు పైఉన్న పొట్టును తీసి సన్నగా నిలువుగా కోసుకోవాలి.

Step 6

తరువాత యాలకులను పొడి చేసుకోని జీడిపప్పు మరియు కిస్ మిస్ లను నెయ్యిలో దోరగా వేయించుకోవాలి.

Step 7

ముందుగా ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని కొంచెము వేడైన తరువాత ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యంను వేసుకొని సగము ఉడికిన తరువాత పాలు పోసుకోవాలి.

Step 8

పాలు యిగురుతున్నపుడు కొబ్బరి పాలు పోసి సన్నని మంటమీద ఒక గంట సేపు ఉడకపెట్టుకోవాలి. ఈమిశ్రమాన్ని గరిటెతో బాగా తిప్పటం వలన ముద్దకాకుండ ఉడుకుతుంది.

Step 9

ఒక గంట సమయము తరువాత పాయసం చిక్కగా అయ్యేటపుడు తురుముకున్న బెల్లం వేసి కాసేపు ఉడకనివ్వాలి.

Step 10

పాకం వచ్చాక అందులో పప్పులు మరియు యాలకుల పొడి వేసి మంచిగా కలుపుకొని పొయ్యి పైనుంచి దించుకొని. ముందునాన పెట్టుకున్న కుంకుమ పూవును వేసి దించుకోవాలి తరువాత పచ్చ కర్పూరం వేసి మూతపెట్టుకోవాలి.

Step 11

కొబ్బరి పాయసం సిద్ధం


Kobbari Payasam
 
కొబ్బరి పాయసం | Kobbari Payasam
Author:
Cuisine: Indian
Ingredients
తయారీలో వాడే పదార్ధాలు
  • పావు కిలో సన్నని బియ్యం
  • అర లీటరు పాలు
  • నాలుగు కొబ్బరి కాయలు
  • అర కిలో బెల్లం
  • పచ్చ కర్పూరం
  • యాలకుల పొడి
  • కొంచం సీమబాదం
  • కిస్ మిస్
  • జీడి పప్పు తగినంత
  • కుంకుమ పువ్వు కొద్దిగా
Instructions
తయారీ ఎలా
  1. ముందుగా బెల్లం గడ్డలని సన్నగా తరిగి ఉంచుకోవాలి. సన్నని బియ్యాన్నిశుభ్రంగా కడిగి బుట్టకెయ్యాలి. దానిలో నీళ్ళు పోయేవరకు ఉంచుకోవాలి.
  2. కొబ్బరి కాయల ముక్కలను మిక్సిలో వేసుకొని బాగా మెత్తగా పొడి చేసుకోవాలి
  3. కొబ్బరి ముద్దను ఒక పల్చటి బట్టలో వేసుకొని కొబ్బరి పాలు పిండుకోవాలి మళ్ళీ నీళ్ళు పోసి పాలు పిండాలి.
  4. అలా ఒకటికి రెండు సార్లు చేస్తుంటే కొబ్బరిలోని పాలన్నీ వచ్చే స్తాయి. అలా కొబ్బరినుండి వచ్చిన పాలను ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
  5. బాదం , కుంకుమ పువ్వుని నీటిలో నానపెట్టుకోవాలి. ఆ బాదంపప్పు పైఉన్న పొట్టును తీసి సన్నగా నిలువుగా కోసుకోవాలి.
  6. తరువాత యాలకులను పొడి చేసుకోని జీడిపప్పు మరియు కిస్ మిస్ లను నెయ్యిలో దోరగా వేయించుకోవాలి.
  7. ముందుగా ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని కొంచెము వేడైన తరువాత ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యంను వేసుకొని సగము ఉడికిన తరువాత పాలు పోసుకోవాలి.
  8. పాలు యిగురుతున్నపుడు కొబ్బరి పాలు పోసి సన్నని మంటమీద ఒక గంట సేపు ఉడకపెట్టుకోవాలి. ఈమిశ్రమాన్ని గరిటెతో బాగా తిప్పటం వలన ముద్దకాకుండ ఉడుకుతుంది.
  9. ఒక గంట సమయము తరువాత పాయసం చిక్కగా అయ్యేటపుడు తురుముకున్న బెల్లం వేసి కాసేపు ఉడకనివ్వాలి.
  10. పాకం వచ్చాక అందులో పప్పులు మరియు యాలకుల పొడి వేసి మంచిగా కలుపుకొని పొయ్యి పైనుంచి దించుకొని. ముందునాన పెట్టుకున్న కుంకుమ పూవును వేసి దించుకోవాలి తరువాత పచ్చ కర్పూరం వేసి మూతపెట్టుకోవాలి.
  11. కొబ్బరి పాయసం సిద్ధం

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

1,147

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu