Mutton Dalcha

2013-08-22
Allrecipeshere

Mutton Dalcha Recipe గోష్ కా దాల్చా

 

గోష్ కా దాల్చా కావలసినవి:

  • శనగపప్పు - 200 గ్రా.;
  • నూనె - పావు కిలో
  • షాజీరా - టేబుల్ స్పూను
  • దాల్చినచెక్క - అర టీ స్పూను
  • లవంగాలు - 10
  • ఉల్లితరుగు - 100 గ్రా.
  • కారం - 100 గ్రా.
  • పసుపు - చిటికెడు; ఉప్పు - తగినంత
  • పచ్చిమిర్చి - 10 (సన్నగా తరగాలి)
  • మిరియాలపొడి - టీ స్పూను
  • కొత్తిమీర - చిన్న కట్ట (సన్నగా కట్ చేయాలి)
  • సొరకాయ ముక్కలు - 500 గ్రా.
  • టొమాటో ముక్కలు - 400 గ్రా.
  • చింతపండు - 100గ్రా. (నానబెట్టి గుజ్జు తీసుకోవాలి)
  • ధనియాలపొడి - రెండు టీ స్పూన్లు
  • జీలకర్రపొడి - రెండు టీ స్పూన్లు
  • పుదీనా - చిన్న కట్ట
  • మటన్ ముక్కలు - 500 గ్రా.
  • ఏలకులు - 10
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ - 50 గ్రా.
  • కరివేపాకు - నాలుగు రెమ్మలు

గోష్ కా దాల్చా తయారి:

Step 1

శనగపప్పును ఉడికించి మెత్తగా చేసుకోవాలి. మటన్‌ను బాగా కడిగి తగినంత నీరు జత చేసి సుమారు అరగంటసేపు ముక్కలు మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి.

Step 2

బాణలిలో నూనె వేసి కాగాక, షాజీరా, దాల్చినచెక్క, లవంగాలు, ఏలకులు వేసి వేయించాలి.

Step 3

ఉల్లి తరుగు జతచేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి.

Step 4

అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. కారం, కరివేపాకు, పసుపు, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి.

Step 5

ఉప్పు, మిరియాలపొడి, కొత్తిమీర తరుగు వేసి ఒక నిముషం వేయించాలి.సొరకాయ ముక్కలు, టొమాటో తరుగు, ఉడికించిన మటన్, మెత్తగా చేసిన శనగపప్పు వేసి, అన్నీ ఉడికేవరకు ఉంచాలి.

Step 6

చింతపండు గుజ్జు వేసి పది నిముషాలపాటు ఉడికించాలి. ధనియాలపొడి, జీలకర్రపొడి, పుదీనా ఆకులు వేసి రెండు నిముషాలు బాగా కలిపి దించేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Average Member Rating

(0.5 / 5)

0.5 5 2
Rate this recipe

2 people rated this recipe

608

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu