Nimmakaya Rasam Upayogalu

2013-10-25

No more images found for this recipe!

Allrecipeshere

Nimmakaya Rasam Upayogalu

అమ్మ లాంటి నిమ్మ

 • రోజూ పరగడుపున ఒక గ్లాసుడు గోరువెచ్చని నీళ్ళలో ఒక నిమ్మకాయ రసం కలుపుకొని, కొంచెం ఉప్పు కలిపి తాగితే ఊబకాయం తగ్గుతుంది.
 • నిమ్మరసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే, జీర్ణశక్తిబాగుంటుంది. ఒంట్లో కొవ్వు శాతం తగ్గుతుంది.
 • కొంచెం ఉప్పు, నిమ్మరసం, కొద్దిగా పసుపు కలిపి వారానికి రెండుసార్లయినా పళ్ళు తోముకుంటే పలువర మెరవడమే కాకుండా, చిగుళ్ళవ్యాధులు ఉన్న వారికి మంచి ఔషధంగా పనిచేస్తుంది.
 • ప్రయాణాలలో వాంతులతో బాధపడేవారు నిమ్మకాయ వాసన చూడడం, నిమ్మ చెక్కను చప్పరించినా చక్కని ఉపశమనం.
 • శరీరం నీరసించినపుడు సెలైన్‌కు ప్రత్యామ్నాయంగా కొబ్బరినీటిలో నిమ్మరసం పిండుకొని తాగడం వల్ల తక్షణ శక్తి కలుగుతుంది
 • మంచి పోషకపదార్ధాలతోపాటు ఎక్కువగా నిమ్మరసం సేవిస్తూంటే స్త్రీలకు గర్భస్రావాలు జరగవు.
 • వేడివల్ల కలిగే జలుబుకు, నిమ్మషర్బత్ బాగా పనిచేస్తుంది.
 • వడదెబ్బ నిమ్మనీళ్ళలో ఉప్పు కలిపి తాగితే ఉపశమనం కలుగుతుంది.

లభించే విటమిన్లు

కాల్షియం 10.7 మి.గ్రా.
పొటాషియం 16.3 మి.గ్రా.
సోడియం 6.5 మి.గ్రా.
మెగ్నీషియం 11.6 మి.గ్రా.
భాస్వరం 20.7 మి.గ్రా
రాగి 0.26 మి.గ్రా.
విటమిన్ – సి 63 మి.గ్రా.
నియోసిన్ 0.2 మి.గ్రా.
క్లోరిన్ 5.1 మి.గ్రా.
ఫోలిక్‌యాసిడ్ 7 మి.గ్రా.
పిండిపదార్ధాలు 9.మి.గ్రా.
మాంసకృత్తులు 1.5 మి.గ్రా.

పై వాటితో అతి స్వల్పంగా విటమిన్-ఎ, విటమిన్-బి, బి-6 వంటి విటమిన్లు కూడా లభిస్తాయి. 100 గ్రాముల నిమ్మపండులో 40 కాలరీల శక్తి లభిస్తుంది. ఇతర ఆహార పదార్ధాలతో పోలిస్తే నిమ్మలోని పోషకవిలువలు అధికం. ఈ పోషక విలువలన్నీ ప్రతి మనిషికీ అవసరమైనవే! మెదడు చురుగా పని చేయలంటే పొటాషియం, దంతాలు, ఎముకలు పటిష్ఠంగా ఉండడానికి నిమ్మ ఎంతగానో సహకరిస్తుంది.

నిమ్మకాయ రసం

“నిమ్మ చేయు మేలు అమ్మ కూడా చేయదు” అన్నది ఒక తెలుగు లోకోక్తి. ఈ ఉక్తి ద్వారా నిమ్మకాయలోని గొప్పదనం తెలుస్తున్నది. అమ్మ ప్రేమ-మమత-వాత్సల్యాలను ఇవ్వగలదే కానీ, ఆరోగ్యాన్ని ఇవ్వలేదు కదా! నిమ్మ ఆ కొరతను తీరుస్తుందని వైద్యుల అభిప్రాయం. నిమ్మరసం వల్ల అనేక వ్యాధులు నివారింపబడతాయి.

 • మలబద్ధకము, అజీర్ణం, అగ్నిమాంద్యం మొదలగు జీర్ణక్రియ వ్యాధుల్లో ప్రతీరోజూ రెండు పూటలా నిమ్మరసం త్రాగితే జీర్ణరసాలు చక్కగా ఊరుతాయి. ఆకలి పెరిగి, బరువు హెచ్చుతుంది.
 • లావుగా ఉండేవారు ఆహారాన్ని తగ్గించి, రోజుకు రెండు మూడుసార్లు నిమ్మరసం సేవిస్తే, బరువు తగ్గుతుంది.
 • రోజుకు నాలుగుసార్లు నిమ్మరసం త్రాగితే పచ్చకామెర్ల వ్యాధి తగ్గుతుంది.
 • వేడినీటిలో నిమ్మరసం పిండి త్రాగితే ఉబ్బసం ఉపశమిస్తుంది.
 • గజ్జి, తామర, చుండ్రు, పొడలు, వ్రణాలు, మొటిమలు, కుష్టు మొదలగు చర్మవ్యాధులకు నిమ్మరసాన్ని రెండు మూడుసార్లు రోజూ సేవించాలి. లాభం ఉంటుంది.
 • గజ నిమ్మరసాన్ని (ఒక కాయ) 20 గ్రా. కొబ్బరినూనెలో పిండి, తలకూ, ముఖానికి, శరీరానికి రాసుకుని, ఎండలో 15 ని|| ఉండి తర్వాత స్నానం చేస్తే, అనేక చర్మ వ్యాధులు నివారితమౌతాయి. నిమ్మకాయను క్రిమిసంహారిణిగా కూడా ఉపయోగిస్తారు. ఆరోగ్యంగా ఉన్నవారు కూడా వారానికి ఒకమారు నిమ్మనూనె రుద్దుకుంటే చర్మానికి ఆరోగ్యం, కాంతి చేకూరుతాయి. నల్లమచ్చలు గలవారు ఈ నూనెను 40 రోజుల వరకు రుద్దుకుంటే, ఫలితం కనబడుతుంది.
 • నంజు, నీరు, వాపులు కలవారు వేడినీటితో నిమ్మరసాన్ని త్రాగితే, మూత్రవిసర్జన అధికంగా జరిగి, రోగనివారణ అవుతుంది.
 • మధుమేహం, రక్త మూత్రం, అతివేడి అగిర్త, ఎండదెబ్బ, వడదెబ్బ, మొదలగు వ్యాధులకు నిమ్మరసం బాగా ఉపయోగపడుతుంది.
 • రక్తప్రసరం, శ్వేతప్రసరం, పాండువ, రక్తచీణ్త, క్షయ మొదలగు రోగాల్లో కూడా నిమ్మరసం ప్రయోజనకారిగా ఉంటుంది.
 • కండ్ల కలకలు కంటి మసకలకు రెండు నిమ్మరసం చుక్కల్ని మూడు రోజులు వేసుకోవాలి; తగ్గుతాయి.
 • చెవిలో కురుపు, చీము, బాధ ఉంటే, నిమ్మరసం చుక్కలు, కొబ్బరి నూనె కలిపి మూడు రోజులు వేసుకుంటే తగ్గిపోతాయి.
 • నిమ్మతొక్కలు ఎండవేసి, కొన్ని ఉలవలు లేదా పెసలు కలిపి, మరపట్టించి, ఆ పిండిని చర్మానికి రాసుకుని స్నానం చేస్తే, చర్మం నిగ నిగ లాడుతూ ఉంటుంది.
 • వివిధ వంటకాలల్లో నిమ్మకాయను ఉపయోగించవచ్చు.
 • పచ్చి కూరలు సన్నగా తురిమి వాటిలో నిమ్మకాయ పిండుకుని తింటే, ఆరోగ్యం, రుచి రెండూ లభిస్తాయి.
 • మజ్జిగలో నిమ్మకయ పిండుకుని త్రాగితే, వేడితాపం చల్లబడుతుంది.
 • నిమ్మ పచ్చడి ఆరోగ్యదాయకం.

ఇన్ని సుగుణాలున్నవి కాబట్టి నిమ్మచెట్టును ప్రతి ఇంటిలోనూ పెంచుకోవటం మంచిది. నిమ్మచెట్టును పెంచి, దాని ద్వారా లాభం పొందాలి.

మ్మరసాన్ని తయారుచేయుట

నిమ్మరసం అంటే చక్కని చిక్కని రసం కాదు. ఆ రసం చాలా తీక్షణత గల్గి ఉంటుంది. బండమీద పడితే, బండ తెల్లగా పొంగటం అందరికీ తెలుసు. అలాంటి నిమ్మరసం నేరుగా స్వీకరిస్తే, మృదువైన జీర్ణాశయం రంధ్రాలు పడి, చెడిపోతుంది. కాబట్టి నిమ్మరసాన్ని అలాగే పుచ్చుకోకూడదు. ఒక గ్లాసు నీరు తీసుకోవాలి. ఒక నిమ్మకాయ కోయాలి. కాయ పెద్దదయితే ఒక ముక్కను ఆ గ్లాసు నీటిలో పిండాలి. కాయ చిన్నగా ఉంటే రెండు ముక్కలను పిండుకోవచ్చు. ఇలా నిమ్మరసం తయారవుతుంది. ఈ నిమ్మరసానికి రెండు చెంచాల స్వచ్చమైన తేనెను కలిపితే బాగుంటుంది. తేనె లేకపోతే, కొద్దిగా బెల్లం వేసుకోవచ్చు. లేదా ఏమీ వేసుకోకుండా అలాగే త్రాగవచ్చు. ఇలా తయారు చేసిన నిమ్మరసాన్ని రోగికి ఉందయం 7 గంటలకు, 10 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకు, 3 గంటలకు, సాయంత్రం 6 గంటలకు అవసరమైతే రాత్రి పడుకునే ముందు ఇవ్వాలి. ఈ నిమ్మరసం సేవించే కాలంలో రోగి ఉపవాసం చేస్తూ ఉండాలి. “లంఖనం పరమ ఔషధం” అన్నారు కదా! ఉపవాసకాలంలో జీర్ణాశయానికి తగినంత విశ్రాంతి లభిస్తుంది. శరీరంలోని రోగ పదార్ధాలు సులువుగా మల-మూత్ర-స్వేధాల ద్వారా విసర్జింపబడుతుంటాయి. మల దోషాలు నివారింపబడతాయి. మూత్రదోషాలు తగ్గుతాయి. శ్వాసక్రియ సక్రమంగా సాగుతుంది. కొంతకాలం నిమ్మరసం సేవించటంతో, తిరిగి నిజమైన ఆకలి వేస్త్తుంది. అప్పుడు ఉపవాసం చాలించవచ్చు. రోగికి ఆరోగ్యం చేకూరి, మామూలు మనిషి ఔతాడు. నిమ్మరసం ఇలా అనేక రకాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి మనిషి నిమ్మరసాన్ని సేవిస్తూ, దాని ప్రయోజనాలను పొందుతూ ఉండాలి.

Recipe Type: Ingredients:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

6,064

Related Recipes:
 • Pakoras recipes

  Pakoras Recipes In Telugu

 • Vermicelli Kheer

  Vermicelli Kheer

 • Banana Cutlets

  Banana Cutlets Recipe

 • Methi Vadiyalu

  Methi Vadiyalu

 • Semiya Vadiyalu

  Semiya Vadiyalu