Ramzan Special Biryani Recipe

2013-08-07
Allrecipeshere

రంజాన్ స్పెషల్ ఖైబర్‌ బిర్యాని

బిర్యానికి కావలసిన పదార్థాలు

  • బిర్యాని బియ్యం –  (౧) ఒక కిలో,
  • గొర్రె మాంసము / మటన్‌ ముక్కలు  – (౧) ఒక కిలో
  • స్వచ్ఛమైన పెరుగు –  (౧) ఒక టిన్నర లీటరు
  • ఉప్పు – సరిపడా,
  • ఉల్లిపాయలు – (౩) మూడు
  • అల్లం వెల్లుల్లి పేస్ట్‌ – (౨) రెండు టేబుల్‌ స్పూన్లు
  • ధనియాల పొడి – (౨) రెండు టేబుల్‌ స్పూన్లు
  • యాలకుల పొడి – అర టీ స్పూన్‌
  • మిరియాల పొడి – (౨) రెండు టీ స్పూన్లు
  • దాల్చిన చెక్క – కొద్దిగా,
  • జీలకర్ర – (౧) ఒక స్పూన్‌
  • కుంకుమ పువ్వు – చిటికెడు,
  • లవంగాలు – (౨౦) ఇరవై
  • నీళ్లు – (౨) రెండు కప్పులు, నెయ్యి – పావు కిలో

రంజాన్ స్పెషల్ ఖైబర్‌ బిర్యాని తయారీ విధానం

శుభ్రం చేసిన మటన్‌ చిన్న ముక్కలు చేయాలి. దానికి అల్లం వెల్లుల్లి ముద్ద, ఉల్లిపాయ ముద్ద, ధనియాల పొడి, దాల్చిన చెక్క పొడి, యాలకుల పొడి, మిరియాల పొడి, జీలకర్ర, కుంకుమ పువ్వు, లీటర్‌ పెరుగు, నీళ్లు పోసి బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని రెండు గంటలు నానబెట్టాలి. పాన్‌లో అడుగున మటన్‌ ముక్కలు వేసి సమానంగా సర్దాలి. బాండీలో సగం నెయ్యి వేసి లవంగాలు వేయించాలి. వీటిని మటన్‌ ముక్కల మీద వంపాలి. కడిగిన బియ్యానికి అరలీటర్‌ పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని మటన్‌ ముక్కలమీద వేసి మూత పెట్టి ఉడికించాలి. ఆవిరి రావడం మొదలవగానే మంట సిమ్‌లో పెట్టి దమ్‌ చేయాలి. పెరుగంతా ఇంకిపోయిన తర్వాత మిగిలిన నెయ్యి వేసి మరో 15 నిముషాలు ఉడికించాలి. ఈ బిర్యానిని పెరుగుతో వండితేనే బాగుంటుంది.

5.0 from 1 reviews
Ramzan Special Biryani Recipe
 
రంజాన్ ప్రత్యేక బిర్యానీ రెసిపీ - Ramzan Special Biryani Recipe
Author:
Recipe type: Main
Cuisine: Indian
Ingredients
  • బియ్యం - 1 కిలో,
  • మటన్‌ ముక్కలు - 1 కిలో
  • పెరుగు - ఒకటిన్నర లీటరు
  • ఉప్పు - సరిపడా, ఉల్లిపాయలు - 3
  • అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 2 టేబుల్‌ స్పూన్లు
  • ధనియాల పొడి - 2 టేబుల్‌ స్పూన్లు
  • యాలకుల పొడి - అర టీ స్పూన్‌
  • మిరియాల పొడి - 2 టీ స్పూన్లు
  • దాల్చిన చెక్క - కొద్దిగా,
  • జీలకర్ర - 1 స్పూన్‌
  • కుంకుమ పువ్వు - చిటికెడు,
  • లవంగాలు - 20
  • నీళ్లు - 2 కప్పులు, నెయ్యి - పావు కిలో
Instructions
  1. శుభ్రం చేసిన మటన్‌ చిన్న ముక్కలు చేయాలి. దానికి అల్లం వెల్లుల్లి ముద్ద, ఉల్లిపాయ ముద్ద, ధనియాల పొడి, దాల్చిన చెక్క పొడి, యాలకుల పొడి, మిరియాల పొడి, జీలకర్ర, కుంకుమ పువ్వు, లీటర్‌ పెరుగు, నీళ్లు పోసి బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని రెండు గంటలు నానబెట్టాలి. పాన్‌లో అడుగున మటన్‌ ముక్కలు వేసి సమానంగా సర్దాలి. బాండీలో సగం నెయ్యి వేసి లవంగాలు వేయించాలి. వీటిని మటన్‌ ముక్కల మీద వంపాలి. కడిగిన బియ్యానికి అరలీటర్‌ పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని మటన్‌ ముక్కలమీద వేసి మూత పెట్టి ఉడికించాలి. ఆవిరి రావడం మొదలవగానే మంట సిమ్‌లో పెట్టి దమ్‌ చేయాలి. పెరుగంతా ఇంకిపోయిన తర్వాత మిగిలిన నెయ్యి వేసి మరో 15 నిముషాలు ఉడికించాలి. ఈ బిర్యానిని పెరుగుతో వండితేనే బాగుంటుంది.

 

Recipe Type: , , Ingredients: ,

Comments (2)

  1. posted by Sri on September 1, 2013

    Can you post this recipe in English, and also the vinayakachaveti recipes in English please!

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

2,180

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu