Tomato Vadiyalu
2015-04-12- Cuisine: Indian
- Skill Level: Easy
-
Add to favorites
Tomato Vadiyalu టొమాటో వడియలు
తయారీలో వాడే పదార్ధాలు
- ఎర్రని టొమాటోలు ½ కిలో
- బియ్యం పిండి ఒక కిలో
- ఉప్పు ఎనమిది చిన్న చెంచాలు
- కారం ఐదు చిన్న చెంచాలు
- జీలకర్ర ఐదు చిన్న చెంచాలు
తయారీ ఎలా
Step 1
ముందుగా టొమాటోలను శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసుకొని వాటిని మిక్సీ లో వేసి గుజ్జులా వచ్చేలాగా తయారు చేసుకోవాలి.
Step 2
ఆ తరువాత సిద్ధం చేసుకున్నా టొమాటో గుజ్జులో 4 నుంచి 5 గ్లాసుల నీళ్ళు పోసి బాగా కలిపి వడగట్టాలి.
Step 3
ఇప్పుడు వడగట్టిన టొమాటో రసాన్ని ఒక పాత్రలో వేసి అందులో జీలకర్ర, రుచికి తగినంత కారం మరియు ఉప్పు వేసి బాగా కలిపి పొయ్యి మీద పెట్టి మరిగించుకోవాలి.
Step 4
ఇప్పుడు మరొక పాత్రలో బియ్యం పిండి మరియు ఉప్పు వేసి కలుపుకోవాలి.
Step 5
తరువాత మరుగుతున్నా టొమాటో రసాన్ని జాగ్రత్తగా గరిటెతో తీసి సిద్ధంగా ఉన్న పిండిలో పోసి జారుగా కలపాలి.
Step 6
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిగిలిన రసంలో పోసి ఉడికించుకొని అది పచ్చి వాసన పోయి మిశ్రమం కాస్త చిక్కబడే వరకు ఉడికించుకొని దించుకోవాలి.
Step 7
తరువాత వీటిని తడి బట్ట మీద గరిటెతో వడియాల్లా పెట్టుకోవాలి. ఇవి గలగల చప్పుడు వచ్చే వరకు ఎండ పెట్టుకోవాలి.
- ఎర్రని టొమాటోలు ½ కిలో
- బియ్యం పిండి ఒక కిలో
- ఉప్పు ఎనమిది చిన్న చెంచాలు
- కారం ఐదు చిన్న చెంచాలు
- జీలకర్ర ఐదు చిన్న చెంచాలు
- ముందుగా టొమాటోలను శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసుకొని వాటిని మిక్సీ లో వేసి గుజ్జులా వచ్చేలాగా తయారు చేసుకోవాలి.
- ఆ తరువాత సిద్ధం చేసుకున్నా టొమాటో గుజ్జులో 4 నుంచి 5 గ్లాసుల నీళ్ళు పోసి బాగా కలిపి వడగట్టాలి.
- ఇప్పుడు వడగట్టిన టొమాటో రసాన్ని ఒక పాత్రలో వేసి అందులో జీలకర్ర, రుచికి తగినంత కారం మరియు ఉప్పు వేసి బాగా కలిపి పొయ్యి మీద పెట్టి మరిగించుకోవాలి.
- ఇప్పుడు మరొక పాత్రలో బియ్యం పిండి మరియు ఉప్పు వేసి కలుపుకోవాలి. తరువాత మరుగుతున్నా టొమాటో రసాన్ని జాగ్రత్తగా గరిటెతో తీసి సిద్ధంగా ఉన్న పిండిలో పోసి జారుగా కలపాలి.
- ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిగిలిన రసంలో పోసి ఉడికించుకొని అది పచ్చి వాసన పోయి మిశ్రమం కాస్త చిక్కబడే వరకు ఉడికించుకొని దించుకోవాలి.
- తరువాత వీటిని తడి బట్ట మీద గరిటెతో వడియాల్లా పెట్టుకోవాలి.
- ఇవి గలగల చప్పుడు వచ్చే వరకు ఎండ పెట్టుకోవాలి.
Average Member Rating
(0 / 5)
0 people rated this recipe
1,748